త్వరలోనే ఇండియా కూటమికి బ్రేక్: కీలకంగా మారిన బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు

by samatah |
త్వరలోనే ఇండియా కూటమికి బ్రేక్: కీలకంగా మారిన బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షాల ఇండియా కూటమి త్వరలోనే విచ్ఛిన్నమతుందని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ విమర్శించారు. శనివారం ఆయన పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ఇండియా’ సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేస్తుందని..కూటమికి ఓ ఎజెండా అంటూ ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష కూటమితో అద్బుతాలు ఏం జరగబో వని కొద్ది రోజుల్లోనే దానికి బ్రేక్ పడటం ఖాయమని తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో పలువురు నాయకులకు అవమానం ఎదురైనట్టు తమకు తెలిసిందన్నారు. సీట్ షేరింగ్ విషయంలో వారి మధ్య ఏకాభిప్రాయాలు కుదరడం లేదని తెలిపారు. కాగా, ఓ వైపు సీట్ల పంపకంపై ఇండియా కూటమి నేతల మధ్య చర్చలు జరుగుతుండగా.. బెంగాల్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డ విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీఎంసీతో పొత్తు ఉండబోదని సైతం బహిరంగంగా వెల్లడించారు. మరోవైపు శనివారం ఇండియా కూటమి నేతలు జూమ్ వేదికగా సమావేశం నిర్వహించానున్నారని, అయితే ఈ మీటింగ్‌ను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బహిష్కరించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed