బ్రాండ్ ఇండియా వచ్చేసింది... ఆస్కార్ అవార్డులపై కేంద్ర మంత్రి హర్షం

by S Gopi |
బ్రాండ్ ఇండియా వచ్చేసింది... ఆస్కార్ అవార్డులపై కేంద్ర మంత్రి హర్షం
X

న్యూఢిల్లీ: ప్రపంచ సినీ వేదికపై భారత్ సత్తాచాటడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసల వర్షం కురిపించారు. బ్రాండ్ ఇండియా వచ్చేంసిందని అని అన్నారు. దేశాన్ని ప్రపంచంలోని కంటెంట్ హబ్‌గా మార్చడానికి సమిష్టి కృషి చేస్తున్నారని అన్నారు. భారత సినిమాలకు రెండు ఆస్కార్ అవార్డులు రావడంపై ఆయన రాజ్యసభలో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటు దేశ ప్రజల హృదయాలను మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఆదరణను పొందిందని చెప్పారు. ప్రపంచ అవార్డులైన ఆస్కార్‌ను రెండు సినిమాలు గెలుపొందడం భారత్‌కు, సినీ రంగానికి గర్వకారణమని చెప్పారు. ఇది కేవలం బ్రాండ్ ఇండియాకు ప్రారంభం మాత్రమే. ప్రపంచానికి కంటెంట్ ఇచ్చే సమర్థ్యం భారత్‌కు ఉంది. సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అస్కార్ ఒరిజినల్ సాంగ్ అవార్డు, తమిళ్ డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పెరెర్స్‌కు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డును గెలుచుకున్నాయి.

Advertisement

Next Story