- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Agniveers : అగ్నివీరులకు ‘బ్రహ్మోస్’ గుడ్ న్యూస్.. ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్
Agniveers : అగ్నివీరులకు ‘బ్రహ్మోస్’ గుడ్ న్యూస్.. ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైళ్లను తయారు చేసే బ్రహ్మోస్ ఏరోస్పేస్ కంపెనీ అగ్నివీరులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలోని టెక్నికల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ విభాగాల ఉద్యోగాల్లో దాదాపు 15 శాతం అగ్నివీరులకు రిజర్వ్ చేస్తామని వెల్లడించింది. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్న బ్రహ్మోస్ యూనిట్లలోని సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో 50 శాతం ఉద్యోగాలను అగ్నివీరులకు రిజర్వ్ చేస్తామని బ్రహ్మోస్ ఏరోస్పేస్ పేర్కొంది.
తమ కంపెనీతో భాగస్వామ్యం కలిగిన ఇతర సంస్థలను కూడా అగ్నివీరులను రిక్రూట్ చేసుకునే దిశగా ప్రోత్సహిస్తామని తెలిపింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది సూపర్ సోనిక్ మిస్సైళ్లను తయారు చేసేందుకు భారత్-రష్యా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీ.
Advertisement
Next Story