- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Delhi: ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఏసీ యూనిట్ మీద పడి బాలుడి మృతి

X
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో శనివారం ఎయిర్‌కండీషనర్ అవుట్‌డోర్ యూనిట్ మీద పడి ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుబయట స్నేహితుడితో కలిసి ఆడుకుంటున్న సమయంలో 2వ అంతస్తు నుంచి ఏసీ యూనిట్ జితేష్(18) తలమీద పడింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాలురు ఇద్దరూ గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, జితేష్ మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. మరో బాలుడు ప్రన్షు(17) చికిత్స పొందుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీస్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకోగా, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. అయితే, దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story