- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Saweety Boora: ప్రపంచ ఛాంపియన్‌కూ తప్పని వరకట్న వేధింపులు

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రపంచ ఛాంపియన్‌గానే కాకుండా భారత నంబర్ వన్ బాక్సర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ప్రముఖ బాక్సర్, అర్జున అవార్డు గ్రహీత స్వీటీ బూరాకు కూడా అత్తింటి వేధింపులు తప్పలేదు. తాజాగా, తనను వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారంటూ భర్త దీపక్ హుడా, అతని కుటుంబసభ్యులపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు హర్యానాలోని హిసార్‌లో ఫిర్యాదు చేశారు. స్వీటీ బూరా భర్త దీపక్ హుడా కూడా ఆసియాడ్ కాంస్య విజేత, అర్జున అవార్డు గ్రహీత కావడం విశేషం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వరకట్న వేధింపుల కేసును నమోదు చేసినట్టు హిసార్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సీమా గురువారం తెలిపారు. ఈ నెల 25న దీపక్ హుడాపై స్వీటీ బూరా వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై హుడాకు 2-3 సార్లు నోటీసులు కూడా ఇచ్చామన్న సీమా, గాయం కారణంగా ఆరోగ్యం బాగోలేదని, హాజరు కాలేనని అతను చెప్పినట్టు ఆమె తెలిపారు. మెడికల్ సర్టిఫికేస్ట్ పోలీసులకు ఇచ్చానని, మరొకరోజు వస్తానని పేర్కొన్నారు. అయితే, తన భార్యపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని దీపక్ హుడా వెల్లడించారు. కాగా, స్వీటీ బూరా, దీపక్ హుడాలకు 2022లో వివాహం జరిగింది. దీపక్ హుడా 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రోహ్‌తక్ జిల్లాలో ఉన్న మెహం నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరపున ఎన్నికల్లోనూ పోటీ చేశారు. భారత కబడ్డీ జట్టులో సభ్యుడైన దీపక్, 2014 నాటి ఆసియా క్రీడల్లో కాంస్యం, 2016లో దక్షిణాసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలిచారు.