పెళ్లి వాగ్దానంతో సెక్స్ : పేరెంట్స్ తిరస్కరణతో యువకుడు మాటతప్పితే.. అది రేప్ కాదు : హైకోర్టు

by Hajipasha |   ( Updated:2024-02-02 18:41:44.0  )
పెళ్లి వాగ్దానంతో సెక్స్ : పేరెంట్స్  తిరస్కరణతో యువకుడు మాటతప్పితే.. అది రేప్ కాదు : హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : రేప్‌ కేసులపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటాననే వాగ్దానంతో ఒక మహిళతో లైంగిక సంబంధాన్ని పెట్టుకొని.. తల్లిదండ్రులు ఒప్పుకోలేదనే కారణంతో ఆ మహిళను పెళ్లాడలేకపోతే అది రేప్‌గా పరిగణించబడదని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా తనను వాడుకొని వదిలేశాడంటూ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో యువకుడిపై ఒక యువతి కేసు పెట్టింది. దీన్ని విచారించిన న్యాయస్థానం.. సదరు యువకుడికి వేరొక యువతితో పెళ్లి ఫిక్సయిన తర్వాత దురుద్దేశపూర్వకంగా ఈ కేసును బనాయించారని అభిప్రాయపడింది. వాట్సాప్ ఛాట్‌లోని సమాచారం ప్రకారం.. చివరి వరకు సదరు యువతిని పెళ్లి చేసుకునేందుకే ఆ యువకుడు ప్రయత్నించాడని నిర్ధారణ అయిందని కోర్టు తెలిపింది. అనుకోని పరిస్థితుల్లో పేరెంట్స్ నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో అతడు పెళ్లి విషయంలో యువతికి ఇచ్చిన మాటను తప్పాడని వివరించింది. ఈనేపథ్యంలో సదరు యువకుడిపై యువతి పెట్టిన అత్యాచారం కేసు చెల్లదని, దురుద్దేశం ఏ మాత్రం లేని సదరు యువకుడిపై రేప్ అభియోగాలు మోపడం సరికాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రేప్ కేసులో నిందితుడిని నిర్దోషిగా గుర్తించి బాంబే హైకోర్టు విడుదల చేసింది.

Advertisement

Next Story