Kangana Ranaut : ‘ఎమర్జెన్సీ’ సినిమాపై కంగనాకు బాంబే హైకోర్టు బిగ్ రిలీఫ్

by Y. Venkata Narasimha Reddy |
Kangana Ranaut : ‘ఎమర్జెన్సీ’ సినిమాపై కంగనాకు బాంబే హైకోర్టు బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించి, స్వయంగా నిర్మించిన ‘ఎమర్జెన్సీ చిత్రానికి సంబంధించి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘ఎమర్జెన్సీ’ సినిమా సర్టిఫికెట్ విషయంలో వారం రోజుల్లో అంటే సెప్టెంబర్ 25లోగా నిర్ణయం తీసుకోవాలని సీబీఎఫ్‌సీకి సూచించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు సీబీఎఫ్‌సీకి నోటీసులు జారీ చేసింది. అలాగే, సినిమాతో ‘లా అండ్ ఆర్డర్ సమస్య పై ఆందోళన ఉన్నదని..సృజనాత్మక స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛను హరించలేమని కీలక వ్యాఖ్యలు చేసింది. లా అండ్ ఆర్డర్ నేపథ్యంలో సెన్సార్ బోర్డ్ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించరాదని పేర్కొంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర, ఎమర్జన్సీ నాటి పరిణామాల నేపథ్యంలో కంగనా తెరకెక్కించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా ఆరంభం నుంచే ఎన్నో వివాదాలు ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను నెగెటీవ్ గా తీశారని.. పంజాబీలను తక్కువ చేసి చూపించారంటూ అటు హర్యానా హైకోర్టు, చంఢిగడ్ జిల్లా కోర్టుల్లోనూ కేసులు కొనసాగుతున్నాయి. ఈ కారణంగానే ఇప్పటికే కొన్ని చోట్ల కంగనా సినిమాపై నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ సినిమా విడుదల కోసం కంగనా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే ఆమె బీజేపీ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా మూవీ విడుదలపై రాజకీయ వివాదాలు చెలరేగాయి. విడుదల సమయం రాగానే సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి సీబీఎఫ్‌సీ నిరాకరించింది. దీనిని ప్రశ్నిస్తూ కంగనా కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఎట్టకేలకు కోర్టు సీబీఎఫ్‌సీకి నోటీసులివ్వడంతో కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. తన సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడంలో సీబీఎఫ్‌సీ జాప్యం చేస్తోందని, సీబీఎఫ్‌సీకి కోర్టు నోటీసులు జారీ చేయాలని నటి కంగనా రనౌత్ కోర్టును ఆశ్రయించారు. ‘రెండు వారాల క్రితమె పిటిషన్ ను విచారించిన బాంబే హైకోర్టు ఇదే అంశంపై ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఎఫ్‌సీకి నోటీసులు జారీ చేసివున్నందునా మేము(బాంబే హైకోర్టు) ఈ దశలో సీబీఎఫ్‌సీకి నోటీసు జారీ చేయలేం’ అని నిరాకరించింది. తాజా విచారణలో ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సంబంధించి బాంబే హైకోర్టు సీబీఎఫ్‌సీకి నోటీసులు జారీ చేసింది. వారంలోగా అంటే సెప్టెంబర్ 25లోగా సినిమా సర్టిఫికెట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సీబీఎఫ్‌సీకి సూచించింది.

Read More..

ఐ లవ్ యూ అంటూ శ్రీ లీలకు నెటిజన్ కామెంట్.. దానికి ఆమె రియాక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే

Advertisement

Next Story

Most Viewed