- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: వారం రోజుల్లోనే రెండో ఘటన
దిశ, నేషనల్ బ్యూరో: చెన్నయ్ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ఎదురైంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నయ్ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో 6E 5314 విమానం శనివారం ఉదయం 6:50 గంటలకు చెన్నయ్ నుంచి బయలు దేరింది. ఈ క్రమంలోనే ప్లైట్‌కు బాంబు బెదిరింపు ఎదురైంది. ఓ అనుమానిత రిమోట్‌ను కూడా విమానంలో సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. అనంతరం 8.45 గంటలకు ముంబై విమానాశ్రయంలో విమానం ల్యాండ్ చేశారు. ఎయిర్ పోర్టులో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భద్రతా ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం విమానాన్ని ఐసోలేషన్ బేకు తీసుకెళ్లారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం విమానం తనిఖీల్లో ఉందని పేర్కొంది. కాగా, వారం రోజుల వ్యవధిలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. మే 28న 176 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో 6ఈ-2211 విమానానికి హెచ్చరికలు వచ్చాయి. అలాగే ఏప్రిల్‌లోనూ నాగ్‌పూర్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చాయి.