- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Flight bomb threat : విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు

దిశ, వెబ్‌డెస్క్: Flight bomb threat: ఈ మధ్య కాలంలో విమానాలకు బాంబు బెదిరింపు(Bomb Threat) కాల్స్ ఎక్కువైన సంగతి తెలిసిందే. తాజాగా కేరళ(Kerala)లోని కొచ్చి నుంచి ఇండిగో(IndiGo flight) విమానం 171 మంది ప్రయాణికులతో తమిళనాడులోని చెన్నై(Chenna)కి శనివారం రాత్రి బయలు దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అమెరికా, కేరళకు చెందిన ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ షురూ అయ్యింది. ఈ గొడవ కాస్త బాంబు బెదిరింపుల వరకు వెళ్లింది. తమ దగ్గర బాంబులు ఉన్నాయని..విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులకు దిగడంతో మిగతా ప్రయాణికులు షాక్ అయ్యారు. అక్కడేం జరుగుతుందో తెలియన భయంగా గడిపారు.
బాంబు బెదిరింపు(Bomb Threat) హెచ్చరికలను విమానంలోని పైలట్ ఎయిర్ పోర్టు అధికారులకు తెలియజేశారు. దాంతో చెన్నై ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. విమానం ల్యాండ్ అయ్యేందుకు ముందే భద్రతా బలగాలతో అత్యవసర పరిస్థితుల్లో చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఫ్లైట్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులంతా దింపేశారు. ఎలాంటి ప్రమాదం లేకుండా ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టారు భద్రతా దళాలు. చివరికి ఎలాంటి బాంబు లేదని తేలింది. గొడవ పడిన ఆ ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.