'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాపై జమ్మూలోని కాశ్మీరీ పండిట్లు ఏమంటున్నారు? (వీడియో)

by Sumithra |
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై జమ్మూలోని కాశ్మీరీ పండిట్లు ఏమంటున్నారు? (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఫిబ్ర‌వ‌రి 17న‌, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA) 96వ 'కామన్ ఫౌండేషన్ కోర్స్ వీడ్కోలు ఫంక్షన్‌లో బిజెపి ఐకాన్‌, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'ఫైల్స్‌' కేవలం గణాంకాలు మాత్ర‌మే క‌లిగి ఉండ‌వు, అవి ప్ర‌జ‌ల‌ ఆకాంక్షలను తెలియ‌జేస్తాయి' అన్నారు. ఈ మాట అన‌డానికి స‌రిగ్గా ఐదు రోజుల ముందు 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా విడుద‌ల‌య్యింది. ఈ రెండు అంశాల్లో ఉన్న 'ఫైల్స్' అనే ప‌దానికి లింక్ పెట్టినా, పెట్ట‌కున్నా.. నిజంగానే, గ‌వ‌ర్న‌మెంట్ ఫైల్స్‌లో ఉన్న గ‌ణాంకాలు క్షేత్ర‌స్థాయిలో సేక‌రించిన నిజాలే కావాలి! అయితే, ఎన్నో సంద‌ర్భాల్లో నిరూపిత‌మైన‌ట్లు కొన్ని 'ఫైల్స్‌'లో నిజాలు, కొన్నింటిలో అబ‌ద్ధాలూ ఉండ‌క‌పోవు. మ‌రి ఇటీవ‌ల విడుద‌లైన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాలోని 'ఫైల్స్' క‌థ‌నాలు నిజ‌మైన‌వేనా.. అబ‌ద్ధాలా?! ప్ర‌ధాని మోడి సందేశంలో ఉన్న‌ 'ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, ఆలోచ‌న‌లు' ఎలా ఉన్నాయి..?! చూద్దాం

ఇప్పుడు 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా దేశవ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయంశ‌మ‌య్యింది. కొంద‌రు హిందువులు ఈ సినిమాను చూసి ముస్లీముల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తుంటే, మ‌రికొంద‌రు విమ‌ర్శ‌నాత్మ‌కంగా చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నారు. స‌మాజాన్ని ప్ర‌భావితం చేస్తున్న సాధ‌నాల్లో ప్ర‌ముఖ స్థానం పొందిన‌ సినిమా వ‌ల్ల అన‌ర్థాలు సంభ‌వించ‌క‌పోయినా, అపార్థాలు వ్యాప్తి చెంద‌క‌పోవు. అందుకే, ఈ సినిమాపై కాశ్మీరీ పండిట్లు ఏమ‌నుకుంటున్నారో ఓ మీడియా సంస్థ చేసిన క్షేత్ర‌స్థాయి అభిప్రాయాల‌ను చూస్తే ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి.

బిబిసి చూపించిన‌ ఈ క్షేత్ర‌స్థాయి అభిప్రాయాల్లో కొంద‌రు కాశ్మీరీ పండిట్లు 'ఈ సినిమా 2024 ఎన్నికల స్టంట్‌' అంటుంటే, మ‌రికొంద‌రు, 'ఇలాంటి సినిమాలు మ‌త‌సామ‌ర‌స్యాన్ని భ‌గ్నం చేసి, ప్ర‌జ‌ల మ‌ధ్య‌ దూరం సృష్టిస్తాయ‌ని' అంటున్నారు. మ‌త‌ఛాంద‌స‌ పాకిస్థానీయులు కొంద‌రు చేస్తున్న కుట్ర‌ల‌కు ముస్లీములంద‌ర్నీ బాధ్యుల్ని చేయ‌డం అన్యామంటున్నారు ఇంకొంద‌రు. మొత్తానికి ఈ సినిమా దేశ రాజ‌కీయాల్లో చాప‌కింద పొగ‌లా హీట్ ర‌గిలించే అవ‌కాశం లేక‌పోలేద‌ని అనిపిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed