- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలింగ్ జరిగిన మరుసటి రోజే.. బీజేపీ అభ్యర్థి కన్నుమూత
దిశ, నేషనల్ బ్యూరో : తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానానికి శుక్రవారం పోలింగ్ జరిగింది. అయితే అక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ (72) శనివారం ఉదయం మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సర్వేష్.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో కున్వర్ సర్వేష్ ఈసారి పెద్దగా ఎన్నికల ప్రచారం చేయలేదు. ఆయన గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. తొలిసారిగా 1991లో ఠాకూర్ ద్వారా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొరాదాబాద్ నుంచి గెలిచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు.2019 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఎస్టీ హసన్ చేతిలో ఓడిపోయారు. కున్వర్ సర్వేష్ కుమారుడు కున్వర్ సుశాంత్ సింగ్.. మొరాదాబాద్ లోక్ సభా స్థానం పరిధిలోని బాధాపూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.