బీజేపీ జైశ్రీరామ్ నినాదాలు కోపం, ద్వేషాలకు ప్రతీక : గొగోయ్

by Hajipasha |
బీజేపీ జైశ్రీరామ్ నినాదాలు కోపం, ద్వేషాలకు ప్రతీక : గొగోయ్
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ క్యాడర్ చేస్తున్న జైశ్రీరామ్ నినాదాలు కేవలం కోపం, ద్వేషాలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయని లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. మహాత్మా గాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సేను పూజించే సంప్రదాయాన్ని ఇప్పటికైనా బీజేపీ ఆపాలన్నారు. అయోధ్య రామాలయం నిర్మాణంపై శనివారం లోక్‌సభలో జరిగిన చర్చలో గొగోయ్ మాట్లాడారు. రాముడు అందరికీ చెందినవాడని, ఆయన ఎల్లవేళలా అందరితో ఉంటాడన్నారు. భగవాన్ శ్రీరాముడు ప్రతి క్షణం మనలోని ప్రతి భాగంలో ఉంటాడని గొగోయ్ చెప్పారు. ‘‘రామరాజ్యం అంటే అందరూ సంతోషంగా ఉండే యుగం.. అయితే ఇప్పుడు ఎవరూ సంతోషంగా లేరు. ప్రస్తుతం దేశంలోని అణగారిన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు సంతోషంగా ఉన్నారా ?’’ అని ఆయన ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం, అసహనం, మైనారిటీల పట్ల హింస వంటి అంశాలను పట్టించుకునే విషయంలో బీజేపీని అహంకారపూరిత భావజాలం అడ్డుకుంటోందని గౌరవ్ గొగోయ్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed