AAP Vs BJP : కేజ్రీవాల్‌ ‘ఎలక్షన్ హిందువు’.. ఢిల్లీ బీజేపీ సంచలన ఆరోపణలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-31 12:31:26.0  )
AAP Vs BJP :  కేజ్రీవాల్‌ ‘ఎలక్షన్ హిందువు’.. ఢిల్లీ బీజేపీ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో : అరవింద్ కేజ్రీవాల్ ‘ఎన్నికల హిందువు’ అని ఢిల్లీ బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా మంగళవారం ట్వీట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆప్ చీఫ్ అర్చకులు, గురుద్వారా గ్రంధీలకు నెలకు రూ.18వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ‘భూల్ భులయ్యా’ సినిమాలోని రాజ్‌పాల్ యాదవ్ పాత్ర ఫొటోను కేజ్రీవాల్‌లా ఎడిట్ చేసి ‘ఎక్స్’ వేదికగా బీజేపీ పంచుకుంది. ‘పదేళ్లుగా ఇమామ్‌లకు జీతాలు ఇవ్వడంలో బిజీగా గడిపారు. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించారు. గుళ్లు, గురుద్వారాల సమీపంలో లిక్కర్ షాపులను ఏర్పాటు చేసి యాంటి హిందూ పాలిటిక్స్ చేశారు. ఇప్పుడు అకస్మాత్తుగా అర్చకులు, గురుద్వారా గ్రంధీల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు.’ అని బీజేపీ ట్వీట్ చేసింది. ఈ పోస్టర్‌పై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి దమ్ముంటే వారు అధికారంలో ఉన్న 20 రాష్ట్రాల్లో అర్చకులు, గ్రంధీలకు రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed