లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

by Hajipasha |
లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ ఎంపికయ్యారు. స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్‌ అధికారిగా ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తారు. 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారు. ఆయనకు సహాయంగా ఉండే ఛైర్‌పర్సన్ల ప్యానెెల్‌లో కె.సురేష్‌ (కాంగ్రెస్‌), టీఆర్‌ బాలు (డీఎంకే), రాధామోహన్‌ సింగ్‌ (బీజేపీ), ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే (బీజేపీ), సుదీప్‌ బంధోపాధ్యాయ (టీఎంసీ) ఉన్నారు. ఈవివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. భర్తృహరి మహతాబ్‌ ఒడిశాలోని కటక్‌ నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆయన బిజూ జనతాదళ్‌ని వీడి బీజేపీలో చేరారు. కటక్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఏడోసారి విజయ దుందుభి మోగించారు. 18వ లోక్‌సభ సమావేశాలు జూన్‌ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 24, 25 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం జరగనుంది. జూన్‌ 26న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed