- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరోసారి బీజేపీదే అధికారం.. వచ్చే ఎన్నికల్లో 300 సీట్లు గెలుస్తాం : అమిత్ షా
డిస్పూర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 300లకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా అసోం దిబ్రూఘర్ బీజేపీ కార్యాలయానికి శంఖుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో అసోంలో 14 స్థానాల్లో 12 చోట్ల విజయం సాధిస్తోందని చెప్పారు. గతంలో ఈశాన్యం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేదని చెప్పారు.
ప్రస్తుతం పరిస్థితులు మారాయని.. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసినప్పటికీ మూడు రాష్ట్రాల్లో పార్టీ విఫలమైందని చెప్పారు. దీంతో త్వరలోనే కాంగ్రెస్ దేశం నుంచి తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. రాహుల్ యూకేలో భారత్‌ను అవమానిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు దారుణమని చెప్పారు. ప్రధానిని ఎంత విమర్శిస్తే అంత బీజేపీ ఎదుగుతుందని తెలిపారు. గతంలో బీజేపీ నిరసనలు, ఉగ్రవాదానికి మారుపేరుగా ఉండేదని, అయితే కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక అనేక మంది తీవ్రవాదులు ఆయుధాలు వీడారని అన్నారు.