2027లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు: కాషాయ పార్టీ ఎమ్మెల్యే

by Harish |
2027లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు: కాషాయ పార్టీ ఎమ్మెల్యే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పార్టీ తక్కువ స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో తాజాగా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రమేష్ చంద్ర మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వీడియోలో మాట్లాడిన ఆయన, యూపీలో బీజేపీ చాలా అధ్వాన్న స్థితిలో ఉంది, పార్టీ కేంద్ర నాయకత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, లేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని అన్నారు. దళితులు, పేదలకు సంబంధించిన సమస్యలపై సమాజ్‌వాదీ పార్టీ పెద్ద ఎత్తున మాట్లాడటంతో ఈ వర్గాల్లో బీజేపీ స్థానం బలంగా లేదు, వెంటనే కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని పటిష్టమైన నివారణ చర్యలు తీసుకుంటే పరిస్థితిని చక్కదిద్దవచ్చు, లేదంటే 2027లో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలనే కల నెరవేరదు. కాబట్టి ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాలి, ప్రతి పార్టీ కార్యకర్త, నాయకుడు తన వంతు కృషి చేయాలని అన్నారు.

ప్రస్తుత ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై ఎస్పీ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ, యూపీలో బీజేపీ ఆట ముగిసిపోయిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని బీజేపీకి తెలుసని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 80 లోక్‌సభ స్థానాలకు గానూ బీజేపీ కేవలం 33 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది, అఖిలేష్ యాదవ్‌కు చెందిన ఎస్పీ 37 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 7 స్థానాలను కైవసం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed