- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసీని గుప్పిట్లోకి తీసుకునేందుకు బీజేపీ కుట్ర : టీఎంసీ
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) రాజీవ్ కుమార్‌ను ఎన్నికల సంఘం తొలగించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) గుప్పిట్లో బంధించి కీలుబొమ్మలా ఆడించాలని బీజేపీ కుట్ర చేస్తోందని టీఎంసీ నాయకుడు కునాల్ ఘోష్ ధ్వజమెత్తారు. బీజేపీ తన రాజకీయ లక్ష్యాలను చేరుకునేందుకు ఈసీ సహా ఇతర కీలక సంస్థలపై పట్టు బిగించేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందనే అంచనాకు వచ్చినందు వల్లే ఈవిధంగా ఏకపక్షంగా డీజీపీని తొలగించారని కునాల్ ఘోష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా పనిచేసే వ్యక్తిని కొత్త డీజీపీగా నియమించుకునేందుకే ఈ నాటకమంతా ఆడారని తెలిపారు. అధికారులను బదిలీ చేసినంత మాత్రాన టీఎంసీకి జరిగే నష్టమేం లేదని.. ప్రజలంతా మమతా బెనర్జీ వెంటే ఉన్నారని ఆయన చెప్పారు.