బెంగాల్‌లో కల్లోలానికి బీజేపీ కుట్ర : Mamata Banerjee

by Vinod kumar |
Mamata Banerjee Decided to Learn Gorkhali Language to Communicate better with People Of Darjeeling
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కుల, మత విభజన తీసుకొచ్చి రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఈ కుట్రకు తెర లేపిందన్న సమాచారం తమకు ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు, రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రతిపక్ష బీజేపీ ప్రవేశ పెట్టిన తీర్మానంపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడారు.

బీజేపీ రాష్ట్రాల యూనిట్ సీనియర్ నాయకులతో ఇటీవల న్యూఢిల్లీలో జరిపిన సమావేశంలో ఈ కుట్రకు రూపకల్పన చేశారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చీల్చే సత్తా గల ఏ పార్టీకైనా నిధులు సమకూర్చాలని కూడా బీజేపీ ప్లాన్ చేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, రాజ్‌బంగ్షీలతో సహా బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయంటూ రాష్ట్రాన్ని చెడుగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారన్నారు.

Advertisement

Next Story