- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
60 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ
ఇంఫాల్: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి ఎన్నికల్లోఅన్ని స్థానాల్లో బరిలోకి దిగనున్నట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు 60 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేశారు. 'బీజేపీ ఈ సారి మణిపూర్ అన్ని స్థానాల్లో ఒంటిరిగానే బరిలోకి దిగుతుంది. మణిపూర్‌లో సుస్థిర ప్రభుత్వం వస్తుందని, ఆ ప్రాంతం అభివృద్ధి, శాంతిని కొనసాగించేందుకు మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది' అని అన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగ పీపుల్స్ ఫ్రంట్ లతో పొత్తు పై స్పష్టత ఇవ్వక పోవడం గమనార్హం. మణిపూర్‌లో బీజేపీలో చేరిన 16 మంది ఎమ్మెల్యేలలో కనీసం 10 మంది మాజీ కాంగ్రెస్ నేతలకు టిక్కెట్లు లభించాయి.
సీఎం ఎన్ బిరేన్ సింగ్ హింగాంగ్‌లోని తన సంప్రదాయ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మరో కీలక మంత్రి బిస్వజిత్ సింగ్ తొంగ్జు స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. మాజీ జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి సోటాటై సైజా ఉఖ్రుల్ నుంచి పోటీ చేయనున్నారు. తాజా జాబితాలో ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. మరోవైపు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి గూడ్స్ రైలు మణిపూర్ శనివారమే చేరుకుంది. దీంతో వాణిజ్యాన్ని, కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, అక్కడి నుంచి వస్తువులు దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకుంటాయని అన్నారు. 60 స్థానాలున్న మణిపూర్‌లో వచ్చే నెల 27, మార్చి 3న రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.