బీజేపీ సిగ్గుతో తలదించుకోవాలి.. కాంగ్రెస్ ఎంపీ

by Manoj |
బీజేపీ సిగ్గుతో తలదించుకోవాలి.. కాంగ్రెస్ ఎంపీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించాయి. దీంతో తాజాగా సుప్రీంకోర్టు ఆమె వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. దేశంలో జరుగుతున్న పరిణామాలకు శర్మ ఒక్కరే బాధ్యురాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కోర్టు వ్యాఖ్యలు బీజేపీ సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా మతతత్వాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుందనేది రహస్యమేమీ కాదని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed