Rahul Gandhi: రాహుల్ వియత్నాం పర్యటనపై బీజేపీ ఫైర్

by Shamantha N |
Rahul Gandhi: రాహుల్ వియత్నాం పర్యటనపై బీజేపీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌(Manmohan Singh) మృతి తర్వాత పలు అంశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. కాగా.. ఇలాంటి టైంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) వియత్నాం ట్రిప్ పై బీజేపీ(BJP lashed out at Rahul Gandhi) విరుచుకుపడింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఒకవైపు దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తుంటే.. రాహుల్ మాత్రం న్యూ ఇయర్ కోసం వియత్నాం వెళ్లారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మండిపడ్డారు. ఆపరేషన్ బ్లూ స్టార్‌ను ఎత్తిచూపుతూ.. గాంధీలు, కాంగ్రెస్ పార్టీ సిక్కులను ద్వేషిస్తూనే ఉంటాయన్నారు. ఇందిరా గాంధీ దర్బార్ సాహిబ్‌ను అపవిత్రం చేశారనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని ఆరోపించారు. అంతేకాకుండా, మన్మోహన్ సింగ్ చితాభస్మ నిమజ్జనానికి కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి చెందిన వారు ఎవరూ హాజరు కాలేదని బీజేపీ విమర్శించింది.

కాంగ్రెస్ కౌంటర్

మరోవైపు బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లారని, దీని వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని కాంగ్రెస్ పేర్కొంది. ఇది వారి వ్యక్తిగత అంశమని పార్టీ వెల్లడించింది. బీజేపీ విభజన రాజకీయాలను ఎప్పుడు వీడనుందో తెలియదని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. అయితే.. కుటుంబ గోప్యతను గౌరవిస్తూ.. మన్మోహన్ సింగ్ అస్తికలు నిమజ్జనం చేసేందుకు ఆయన కుటుంబంతో ఎవరూ వెళ్లలేదని కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed