రాజ్యాంగం మార్చాలంటే 400 సీట్లు కావాలన్న బీజేపీ ఎంపీ: రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
రాజ్యాంగం మార్చాలంటే 400 సీట్లు కావాలన్న బీజేపీ ఎంపీ: రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే 400 సీట్లు కావాలని బీజేపీ ఎంపీ చేసిన ప్రకటన చేశారని పేర్కొన్నారు. ఇది ప్రధాని మోడీ, ‘సంఘ్ పరివార్’ వెనకాల దాగి ఉన్న ఉద్దేశాలను బహిరంగంగా ప్రకటించడమేనని చెప్పారు. బాబా సాహెబ్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే ప్రధాని మోడీ, బీజేపీల అంతిమ లక్ష్యమన్నారు.

న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని వారు ద్వేషిస్తారని తెలిపారు. సమాజాన్ని విభజించి, మీడియాను బానిసలుగా చేసి, భావప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రతిపక్షాలు లేకుండా కుట్రలు పన్నడం ద్వారా భారతదేశ గొప్ప ప్రజాస్వామ్యాన్ని సంకుచిత నియంతృత్వంగా మార్చాలనుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. స్వాతంత్య్ర వీరుల ఆశయాలకు వ్యతిరేకంగా ఈ కుట్రలు ఫలించవని, రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. ప్రతి సైనికుడు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఓబీసీ, మైనార్టీలు మేల్కొనండి.. మీ గళాన్ని పెంచండి.. ఇండియా మీ వెంట ఉంది.. అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed