- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ వాషింగ్ మెషిన్ లాంటిది
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ 'వాషింగ్ మెషీన్ ' లా మారిందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు 'క్లీన్ ' కావాలనుకుంటే ఆ పార్టీలో చేరవచ్చని ఎద్దేవా చేశారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. గురువారం పూణెలోని లోనావాలాలో తమ పార్టీ కార్యకర్తల సదస్సులో మాట్లాడిన శరద్ పవార్, 'ప్రధాని మోడీ అవినీతి గురించి మాట్లాడే సమయంలో అవిభక్త ఎన్సీపీని విమర్శిస్తారు. పార్లమెంటులో ఒక బుక్‌లెట్ ఇస్తూ బీజేపీ అధికారంలో లేనప్పుడు ఎలాంటి అక్రమాలు జరిగాయో చెప్తారు. అందులో ఆదర్శ్ కుంభకోణం, ఆ కుంభకోణంలో అశోక్ చవాన్ ప్రమేయం ఉందని ఆరోపిస్తారు. కానీ వారం గడవకముందే అశోక్ చవాన్ బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడు కూడా అవుతాడు. అంటే, దీనర్థం, ఓవైపు మీరే(బీజేపీ) ఆరోపణలు చేస్తారు. మరోవైపు ఆయా ఆరోపణలు ఉన్నవారిని మీరే మీ పార్టీలో చేర్చుకుంటారని' పవాన్ తెలిపారు. ఇదంతా చూస్తుంటే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని చేరదీసి క్లీన్ చేసుకోగలిగే వాషింగ్ మెషీన్‌గా బీజేపీ మారిందని' అని పవార్ ఆరోపించారు.