- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ వ్యాఖ్యలపై విరుచుకుపడిన రవిశంకర్ ప్రసాద్
దిశ, డైనమిక్ బ్యూరో: అనర్హత వేటు నేపథ్యంలో ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో చెప్పేవన్ని అబద్దాలే అని కొట్టిపారేసింది. బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఓబీసీలను కించపరిచేలా రాహుల్ గాంధీ మాట్లాడారని ధ్వజమెత్తారు. వాక్ స్వాతంత్య్రం ఉంది గాని దూషించే హక్కులేదన్నారు. క్షమాపణలు చెప్పాలని కోర్టు కోరినా రాహుల్ గాంధీ చెప్పలేదని అందుకే శిక్షపడిందన్నారు. కోర్టు తీర్పునే కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని ధ్వజమెత్తారు.
తాను ఏది మాట్లాడిన ఆలోచించే మాట్లాడుతానని రాహుల్ గాంధీ చెబుతారు. దాని అర్థం 2019లో ఆయన ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్టు కాదా అని నిలదీశారు. లండన్ లో ప్రసంగంపై మరోసారి రాహుల్ గాంధీ అబద్ధం ఆడారాని మండిపడ్డారు. అబద్దాలు చెప్పడం రాహుల్ నైజం అని విరుచుకుపడ్డారు. అంతకు ముందు మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అదానీ, మోడీ సంబంధాలపై ప్రశ్నిస్తున్నాననే తనపై కేంద్రం కక్ష కట్టిందన్నారు. తనను జైలుకు పంపినా శాశ్వంతంగా వేటు విధించినా ప్రశ్నించడం ఆపనని చెప్పారు.