- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ కర్ణాటక ప్రతిష్టను దెబ్బతీస్తోంది: డీకే శివకుమార్ వ్యాఖ్యలు
దిశ. నేషనల్ బ్యూరో: బెంగళూరులోని కేఫ్ లో పేలుడు ఘటన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. బీజేపీ నేతలు తమ ముఖాలను అద్దంలో చూసుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసం కర్ణాటక ప్రతిష్టను బీజేపీ దెబ్బతీస్తుందని విమర్శించారు. కాషాయ పార్టీ పాలనలో రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాగా, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించగా.. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ శనివారం నలుగురిని అదుపులోకి తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల తలెత్తిన ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలకు, పేలుడుకు మధ్య సంబంధం ఉందని బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై చర్చించేందుకు కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు.