Bihar: పట్టాలు తప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన రైలు ఇంజిన్.. తప్పిన పెను ప్రమాదం!

by Geesa Chandu |   ( Updated:2024-09-15 12:27:42.0  )
Bihar: పట్టాలు తప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన రైలు ఇంజిన్.. తప్పిన పెను ప్రమాదం!
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్(Bihar) రాష్ట్రంలోని గయా(Gaya)లో పెను రైలు ప్రమాదం(Train Accident) తప్పింది. ఎలాంటి కోచ్‌లు లేకుండా నడుస్తున్న గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది.ఈ ఘటన గయా-కోడెర్మా(Gaya-Koderma) రైల్వే సెక్షన్ పరిధిలోని కొల్హానా హాల్ట్ మధ్య జరిగింది. ఇంజిన్ ను లూప్ లైన్‌ నుంచి గయా వైపు తీసుకెళ్తుండగా పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది.అయితే ఇంజిన్ తో కూడిన కోచ్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

గూడ్స్ రైలు పట్టాలు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లడంతో.. ఆ ప్రాంతంలో పనిచేసే వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ట్రాక్ మారడం వల్లనే.. రైలు ఇంజిన్ పట్టాలు తప్పిందని, అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని, ట్రాక్ కు సంబంధించిన సహాయక చర్యలను కూడా ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story