మహిళలకు క్షమాపణలు చెప్పిన బిహార్ సీఎం నితీష్

by srinivas |   ( Updated:2023-11-08 07:06:19.0  )
మహిళలకు క్షమాపణలు చెప్పిన బిహార్ సీఎం నితీష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనాభా నియంత్రణ విషయంలో మహిళలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు బిహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలతో తప్పుడు సందేశం వెళ్లి ఉంటే క్షమించాలని కోరారు. కులగణన వంటి పెద్ద పనిని పూర్తి చేశామని, తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.

కాగా బిహార్ కులగణన నివేదికపై మంగళవారం అసెంబ్లీలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ చదువుకున్న మహిళలు శృంగారంలో తమ భర్తలను నియంత్రించగలని వ్యాఖ్యానించారు. భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయని, అయితే చదువుకున్న మహిళకు భర్తను ఎలా నియంత్రించాలో తెలుసని. అందుకే ప్రస్తుతం జననాల రేటు తగ్గుతూ వస్తోందన్నారు. నితీష్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందిస్తూ అసెంబ్లీలో నిన్న బీహార్‌ సీఎం ప్రకటన సీ గ్రేడ్‌ సినిమా డైలాగ్‌లా ఉంది. ఆయన వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మరో వైపు నితీష్ కుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే నివేదితా సింగ్ మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. నితీశ్ ప్రసంగం సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సమర్థించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఎక్స్ ఎడ్యుకేషన్ తెలియంది ఎవరికి? అని, ఈ విషయాన్ని అసెంబ్లీలో బోధించడానికి ఈయనెవరు అంటూ మండిపడ్డారు. నితీష్ వ్యాఖ్యలు అసెంబ్లీలో వినలేక పోయామని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా మహిళలను సీఎం అవమానపరిచారని తప్పుబట్టారు.

Advertisement

Next Story

Most Viewed