లవర్స్‌కు భారీ షాక్.. ప్రేమ పెళ్లి చేసుకున్నవారిపై ‘క్రైమ్ ట్యాక్స్’

by Anjali |
లవర్స్‌కు భారీ షాక్.. ప్రేమ పెళ్లి చేసుకున్నవారిపై ‘క్రైమ్ ట్యాక్స్’
X

దిశ, వెబ్‌డెస్క్: చూసిచూడగానే ప్రేమలో పడటం.. ఐలవ్ యూలు చెప్పుకోవడం.. అబ్బాయి ప్రేమను అమ్మాయి యాక్సెప్ట్ చేయగానే డే అండ్ నైట్లు చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రస్తుత రోజుల్లో కామన్ అయిపోయింది. ఎక్కువగా ఇదే పద్ధతిని లైక్ చేస్తోన్న యువత ప్రేమికుడితో కలిసి ఏడడుగులు వేయడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. కానీ వీరి ప్రేమ పెళ్లి బంధం కొంతకాలం కూడా నిలవలేకపోతుంది. చిన్న చిన్న మనస్పర్థలతో గొడవలకు దిగి, కోర్టుకెక్కుతున్నారు. కొంతమంది అన్యోన్యంగా కలిసిమెలసి జీవించగా.. మరికొంతమంది కోర్ట్ల చూట్టూ తిరుగుతున్నారు. అయితే తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఓ జంట. కానీ ఆ ప్రాంతంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నవారికి కొన్ని తరాల నుంచి కుట్ర వరీ (క్రైమ్ ట్యాక్స్) విధిస్తున్నారు. ఒకవేళ పన్ను చెల్లించకపోతే వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. కొన్ని సందర్భాల్లో గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరిగి తప్పు చేశానని క్షమాపణలు కోరాల్సి ఉంటుంది. అంతేకాకుండా రూ. 500 ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కొంతమంది దీన్ని తప్పుపడుతుంటే ఆ ట్యాక్స్ ఆలయ అభివృద్ధికి వెచ్చిస్తామని, ఈ పద్ధతిలో తప్పేంలేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఇక ఎన్నో తరాలుగా కొనసాగుతోన్న ఈ ఆచారాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ క్రాంతి కుమార్ పాడి తెలిపారు.

Next Story

Most Viewed