- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బిగ్ షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని మూడు రాష్ట్రాల్లోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. సంతోఖ్ సింగ్ చౌదరి మరణంతో ఖాళీ అయిన పంజాబ్‌లోని జలంధర్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకు ఆధిక్యంలో కొనసాగుతుండగా ఒడిశా ఝార్సుగూడ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బిజు జనతా దళ్ అభ్యర్థి డిపాలి దాస్ ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ఛన్ బే (ఎస్సీ), సువార్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్నాదళ్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
ఛన్ బే నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే రాహుల్ ప్రకాష్ కోల్ మరణంతో ఉప ఎన్నిక రాగా, సువార్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ అబ్దుల్లా ఆజం ఖాన్ అన్హత వేటుతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇక మెఘాలయలోని సోహియోంగ్ (ఎస్టీ) నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి విజయం సాంధించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ పారటీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థి మరణం కారణంగా ఈ స్థానానికి పోలింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటర్లు షాక్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
Read More... సౌత్‌లో పట్టు కోల్పోయిన BJP.. కర్ణాటక ఓటమితో చేజారిన ఆధిపత్యం