బిభవ్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరణ

by S Gopi |
బిభవ్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు ఢిల్లీ మెజిస్టీరియల్ కోర్టులో చుక్కెదురైంది. బిభవ్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరును తోసిపుచ్చింది. ఈ నెల 13న దాడి ఘటనకు సంబంధించి స్వాతి మలివాల్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బిభవ్ కుమార్‌ను అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోరుతూ బిభవ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఇరువైపు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. బిభవ్ కుమార్ దర్యాప్తునకు సహకరించడంలేదని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్ వాదించింది. వాదనలు విన్న అనంతరం తీర్పును వెలువరిస్తూ కోర్టు బెయిలును నిరాకరించింది.

Advertisement

Next Story

Most Viewed