- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bhutan King: మహా కుంభమేళాకు భూటాన్ రాజు.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbamela)ను భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ (Jigme Khesar Namgyel Wangchuck) మంగళవారం సందర్శించారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. పుణ్య స్నానం ఆచరించిన తర్వాత గంగా పూజ, గంగా హారతిలో పాల్గొన్నారు. వాంగ్ చుక్‌తో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi aadityanath), రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఉన్నారు. అంతకుముందు లక్నో చేరుకున్న వాంగ్ చుక్‌కు యోగీ ఘన స్వాగతం పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలతో వెల్ కమ్ చెప్పారు. అనంతరం కాసేపు ఇద్దరు పలు అంశాలపై చర్చించారు. భారతదేశం-భూటాన్ స్నేహం, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో రాజు పర్యటన కీలకంగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
మహాకుంభమేళాకు 23వ రోజు సైతం భక్తులు భారీగా తరలి వచ్చారు. సాయంత్రం 4 గంటల నాటికి 66.70 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానం చేశారు. దీంతో ఇప్పటి వరకు కుంభమేళాకు హాజరైన భక్తుల సంఖ్య 37.50 కోట్లకు చేరినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వసంత పంచమి సందర్భంగా సోమవారం ఒక్క రోజే 2.33 కోట్ల మంది హాజరైనట్టు తెలిపింది. జాతర ముగిసేలోగా.. 2000 వృద్ధుల పవిత్ర స్నానాలకు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. కాగా, ఈ నెల 26 వరకు మహాకుంభమేళా జరగనుంది.
Read Also..