- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Bhulai Bhai: 111 ఏళ్ల బీజేపీ సీనియర్ నేత భులాయ్ భాయ్ కన్నుమూత
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీకి(BJP) చెందిన అత్యంత సీనియర్ నేత నారాయణ్ అలియాస్ భులాయ్ భాయ్ (Bhulai Bhai) కన్నుమూశారు. భారతీయ జనసంఘ్ నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 111 ఏళ్ల ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లా పగార్ గ్రామంలోని తన నివాసంలోనే భులాయ్ భాయ్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్నారు. కాగా.. సోమవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కప్తర్ గంజ్ లోని ఆస్పత్రికి తరలించారు. గత ఐదురోజులుగా ట్రీట్మెంట్ పొందుతూ ఆయన చనిపోయారు.
దీనదయాళ్ స్ఫూర్తితో..
జనసంఘ్ నాయకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితో భూలాయ్ భాయ్ రాజకీయాల్లో చేరారు. 1974లో ఖుషీనగర్‌లోని నౌరంగియా స్థానం నుంచి రెండుసార్లు జనసంఘ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో బీజేపీని స్థాపించిన తర్వాత కూడా భులాయ్ భాయ్ పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా కొనసాగారు. కరోనా సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) భులాయ్ భాయ్ ఆరోగ్యం గురించి అడిగినప్పుడు ఆయన పేరు వార్తల్లో మార్మోగిపోయింది. ఆ తర్వాతలక్నోలో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సులో కేంద్రహోమంత్రి అమిత్ షా వేదికపైనుంచి దిగి మరీ.. భులాయ్ భాయ్ ని సన్మానించారు. అంతేకాదు, ఉత్తరప్రదేశ్ సీఎంగా 2022లో యోగి ఆదిత్యనాథ్ ప్రమాణకారోత్సవానికి ప్రత్యేక అతిథిగా లక్నో వచ్చారు. కొంతకాలం క్రితం యోగి ఆదిత్యనాథ్ కూడా ఫోన్ చేసి భూలాయ్ భాయ్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు.