- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారత రత్న
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. BJP అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారత రత్న ప్రకటించింది. దేశానికి ఆయన సేవలను కొనియాడుతూ అరుదైన గౌరవం కల్పించింది. ఈ సందర్భంగా అద్వానీకి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు. దేశ అభివృద్ధిలో అద్వానీ చాలా కీలకమైన పాత్ర పోషించారని అన్నారు. ఉప ప్రధానిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా దేశానికి చేసిన సేవలను సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా గుర్తుచేసుకున్నారు. కాగా, అయోధ్య రామమందిర నిర్మాణంలో అద్వానీ చాలా కీలకమైన పాత్ర పోషించారు. రామజన్మభూమిలో శ్రీరాముడి ఆలయ నిర్మాణమే లక్ష్యంగా 1990లో తాను రథయాత్ర చేపట్టారు. 2002 నుండి 2004 వరకు భారతదేశానికి 7వ ఉప ప్రధానమంత్రిగా అద్వానీ పనిచేశారు.
అద్వానీ నేపథ్యం
అద్వానీ1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలోని కరాచీలో జన్మించారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీ..2002- 2004 మధ్య అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో దేశ ఏడో ఉప ప్రధానమంత్రిగా పనిచేశాడు. అంతకుముందు ఎన్డీయే ప్రభుత్వంలో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేగాక 1970 నుంచి 1989 వరకు నాలుగుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1977 నుంచి 1979 వరకు మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1991, 1998, 1999, 2004, 2009, 2014లో గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. రెండు సార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు.
Read More: LK అద్వానీ జీవితంలో అత్యంత కీలక ఘట్టాలివే!