బూస్టర్ డోసు ట్రయల్స్‌కు ఇంట్రానాసల్ వ్యాక్సిన్

by Disha News Desk |
బూస్టర్ డోసు ట్రయల్స్‌కు ఇంట్రానాసల్ వ్యాక్సిన్
X

న్యూఢిల్లీ: ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ విషయంలో మరో ముందడుగు పడింది. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన ఈ వ్యాక్సిన్ బూస్టర్ డోసు ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులిచ్చింది. దేశంలో 9 ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించనుంది. ఈ నెల ప్రారంభంలోనే ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం ప్రికాషనరీ డోసును ప్రారంభించింది.

భారత్ బయోటెక్ తన ఇంట్రానాసల్ వ్యాక్సిన్ మిడ్-టు-లేట్-స్టేజ్ ట్రయల్స్ కోసం గత ఏడాది ఆగస్టులో రెగ్యులేటరీ ఆమోదం పొందింది. గత నెలలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ను సులభతరం చేయడానికి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ బూస్టర్ డోసుకు అనుమతి కోరింది. తాజాగా డీసీజీఐ దీనికి అనుమతులు ఇచ్చింది. కాగా గురువారమే కొవాగ్జిన్, కోవిషీల్డ్‌లకు బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story