Bharat Biotech : అమెరికా కంపెనీ అలోపెక్స్‌తో భారత్ బయోటెక్ జట్టు.. టార్గెట్ ఇదీ

by Hajipasha |   ( Updated:2024-09-11 12:28:09.0  )
Bharat Biotech : అమెరికా కంపెనీ అలోపెక్స్‌తో భారత్ బయోటెక్ జట్టు.. టార్గెట్ ఇదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాకు చెందిన క్లినికల్ స్టేజ్ బయోటెక్నాలజీ కంపెనీ ‘అలోపెక్స్’తో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ జట్టు కట్టింది. ‘ఏవీ0328’ అనే యాంటీ మైక్రోబయల్ వ్యాక్సి‌న్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడంతో పాటు భారత్ సహా అల్ప ఆదాయ దేశాల్లో విక్రయించే విషయంలో ఇరు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి. ఈమేరకు బుధవారం భారత్ బయోటెక్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా లైసెన్సింగ్ పొందిన ప్రాంతాల్లో భారత్ బయోటెక్ విక్రయించే ‘ఏవీ0328’ వ్యాక్సిన్లపై రాయల్టీలు, మైల్ స్టోన్ పేమెంట్లు, వన్ టైం అప్‌ఫ్రంట్ పేమెంట్లను పొందే హక్కు ‘అలోపెక్స్’ కంపెనీకి లభిస్తుంది.

అవసరం ఉన్నా, లేకున్నా.. అతిగా యాంటీబయాటిక్స్ వాడితే మానవ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ పరిస్థితినే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. ఈ పరిస్థితిని నిరోధించేందుకు యాంటీ మైక్రోబయల్ వ్యాక్సి‌న్‌‌లు దోహదపడతాయని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణా ఎల్లా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సాంక్రమిక వ్యాధులను నిరోధించేందుకు సురక్షితమైన, చౌకైన వ్యాక్సిన్లను తయారు చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

Advertisement

Next Story