సైలెంట్‌గా ఆ పని కానిచ్చేసిన బాహుబలి బ్యూటీ.. అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..?

by Kavitha |   ( Updated:2024-10-24 15:54:51.0  )
సైలెంట్‌గా ఆ పని కానిచ్చేసిన బాహుబలి బ్యూటీ.. అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సూపర్’(Super) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘బాహుబలి’(Bahubali) సిరీస్‌తో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత భాగమతి(Bhaagamathie), ‘సైజ్ జీరో’(Size Zero), ‘నిశ్శబ్ధం’(Nishabdham) లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

సైజ్ జీరో సినిమా తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr Polishetty) మూవీలో నటించింది. అయితే ఈ మూవీ అనుకున్నంత హిట్ కాలేక పోయింది. దీంతో ప్రస్తుతం సెలక్టివ్‌గా ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 19 ఏళ్ల తర్వాత మలయాళం ఇండస్ట్రీ(Malayalam industry)లోకి తొలిసారి అడుగుపెట్టబోతోంది. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం స్వీటీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటీ’ ఒకటి అయితే .. ఇంకొకటి ‘కథనార్’. ఈ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ రెండు కాకుండా ‘భాగమతి 2’ స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ భామ ఫోకస్ అంతా ఈ ఘాటీ, కథనార్ సినిమాలపైనే పెట్టిందని తెలుస్తోంది. ఎవరికి తెలియకుండా ఈ చిన్నది చక్కగా రెండు సినిమాలను ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ‘ఘాటీ’ కోసమే క్రిష్(Krish).. హరిహర వీరమల్లు(Harihara Veeramallu) నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పుడు మొదలుపెట్టిన ఈ సిరీస్.. త్వరగానే ముగించాడట. ప్రస్తుతం ఈ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇంకోపక్క ‘కథనార్’ కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ సినిమా కూడా ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం.

ఇక ఈ విషయం తెలియడంతో ఈ అమ్మడు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ ఫినిష్ అయ్యింది అంటే ఒక పోస్టర్ లేదు.. సెట్‌లో ఫొటోస్ లేవు. షూటింగ్ అయిపోయింది అంటే అనుష్క కనిపించదు అని చెప్పుకొస్తున్నారు. కనీసంలో కనీసం షూటింగ్ అయిపోయినట్లు ఒక అప్డేట్ ఇస్తూ పోస్టర్ అయినా రిలీజ్ చేస్తే బావుంటుందని చెప్పుకొస్తున్నారు. ఇక ‘ఘాటీ’ మాత్రం త్వరలోనే అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో అనుష్క ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Advertisement

Next Story