- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bengaluru woman's murder: బెంగాల్ లో బెంగళూరు యువతి హత్య కేసు నిందితుడు
దిశ, నేషనల్ బ్యూరో: సంచలనం రేపిన బెంగళూరు యువతి హత్య కేసులో పోలీసులు అనుమానితుడ్ని గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తి బెంగాల్ కు చెందినవాడని.. అక్కడే ఉన్నట్లు కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరన్ వెల్లడించారు. అతడిని త్వరగా అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని కస్టడీలోకి తీసుకోలేదన్నారు. కానీ, కొందరు అనుమానితులను మాత్రం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే, మహాలక్ష్మి అనే 29 వయ్యాలి కావల్ అనే ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు 30 ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో కుక్కారు. తీవ్ర కలకలం రేపిన ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు.
స్పందించిన ఎన్సీడబ్ల్యూ
ఇకపోతే, యువతితో సంబంధాలు కలిగిన వ్యక్తులపై నిఘా పెట్టడమే కాకుండా.. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరికి అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు, దుండగుడు ఫ్రిజ్‌లో దాచిపెట్టిన మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ హత్యపై జాతీయ మహిళా కమిషన్ (NCW) స్పందించింది. నిందితుడ్ని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేసింది. ఈ కేసులో మూడ్రోజుల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సూచించింది.