- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యుత్ వైర్లు తగిలి తల్లితో పాటు తొమ్మిది నెలల బిడ్డ మృతి
బెంగళూరు: ఓ మహిళ, ఆమె 9 నెలల కుమార్తె విద్యుత్ తీగ తగిలి మృతి చెందిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. సౌందర్య(22) అనే మహిళ తన తొమ్మిది నెలల బిడ్డతో కలిసి తమిళనాడు నుంచి బెంగళూరులోని తన ఇంటికి తిరిగి వెళ్తుండగా వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. వెళ్లే దారిలో రోడ్డుపై విద్యుత్ వైర్లు తెగిపడి ఉండటం గమనించని ఆమె, చీకట్లో దానిపై కాలు వేసింది. దాంతో ఒక్కసారిగా విద్యుద్ఘాతంతో తల్లి, బిడ్డ అక్కడికక్కడే మరణించారు.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, అందుకే అధికారులే కారణమని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కడుగోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్) అధికారులు, సిబ్బందిని కూడా విచారిస్తున్నామని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.