- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కిడ్నాప్ కేసు.. హెచ్‌డీ రేవణ్ణకు షరతులతో బెయిల్
దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన హసన సెక్స్ కుంభకోణంలో జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణకు ఊరట దక్కింది. హెచ్ డీ రేవణ్ణకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బెంగళూరు కోర్టు. ఆయన కుమారుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రమేయం ఉన్న లైంగిక వేధింపుల బాధితురాలి కిడ్నాప్ కేసులో బెయిల్ లభించింది. రూ.5 లక్షల పూచీకత్తుపైన బెయిల్ ఇచ్చింది కోర్టు. అలాగే సిట్ విచారణకు సహకరించాలని ఆదేశించింది.
మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణపై ఏప్రిల్ 29న కిడ్నాప్ కేసు నమోదైంది. ఓ మహిళను కిడ్నాప్ చేసినట్లు ఆమె కుమారుడు ఫిర్యాదు చేశారు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి ఫిర్యాదు మేరకు దీనిపై సిట్ ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హెచ్‌డీ రేవణ్ణను ఈ నెల 4న అరెస్ట్ చేసింది. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని, తండ్రి హెచ్‌డీ దేవెగౌడ నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా మూడు రోజులు సిట్ కస్టడీకి అప్పగించింది. తర్వాత ఈ నెల 14 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు. అయితే ఆ గడువుకు ఒక రోజు ముందే హెచ్‌డీ రేవణ్ణకు బెయిల్ లభించింది.
దేవెగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ సెక్స్ కుంభకోణం అధికార కాంగ్రెస్, బీజేపీ-జేడీ(ఎస్) మధ్య రాజకీయ చిచ్చు రేగింది. దీంతో, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది జేడీ(ఎస్). కర్ణాటకలో తొలిదశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తెల్లారే.. ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. తొలి దశ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది. ఆ స్థానం నుంచి బీజేపీ-జేడీ(ఎస్) కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు ప్రజ్వల్. ఇకపోతే, ఈ కేసులో కర్ణాటక సిట్ అధికారులు ఆదివారం మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సమాచారం.