- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెంగళూరు కోర్టులో హీరో దర్శన్‌కు నిరాశ
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలో రేణుకా స్వామి(Renuka swamy) హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో కన్నడ హీరో దర్శన్ ప్రధాన నిందితుడిగా గుర్తించడంతో కేసు కొలిక్కి వచ్చింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్(actor darshan) తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. కాగా ఇప్పటికే ఒక సారి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించగా.. ఆయన మరోసారి బెంగళూరు కోర్టు(bangalore court)లో బెయిల్ పిటిషన్ వేశారు. కాగా ఆ పిటిషన్ పై నేడు విచారణ జరగ్గా.. బెయిల్ పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నటుడు దర్శన్ కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. దర్శన్ బెయిల్ పిటిషన్‌తో పాటు.. పవిత్ర బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది. కాగా ఆయన ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నారు. రేణుకాస్వామి దర్శన్‌కి వీరాభిమాని, కానీ పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో కొన్ని అసభ్య వ్యాఖ్యలు చేయడంతో అతను హత్యకు గురయ్యాడు.