వివాహ వేడుకలో మంచి నీటికి బదులుగా బీర్లు.. వీడియో వైరల్

by Mahesh |
వివాహ వేడుకలో మంచి నీటికి బదులుగా బీర్లు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి సమీపిస్తుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి సమస్య ప్రజలను వేధిస్తుంది. ముఖ్యంగా మంచినీరు లేక ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. బోరు బావులు అన్ని అడుగంటిపోవడం, చెరువులు ఎండిపోవడంతో తాగునీటి సమస్య వేధిస్తోంది. మరీ ముఖ్యంగా బెంగళూరు పట్టణ ప్రాంతంలో తాగునీటి సమస్య తాండవం చేస్తుంది. దీంతో అక్కడి వారు సోషల్ మీడియా వేదికగా నీటి సమస్యపై వీడియోలు చేస్తున్నారు. ఇందులో ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పెళ్లి కొడుకు తన వివాహానికి వచ్చిన అతిధులకు మంచి నీళ్లకు బదులుగా బీరు బాటీల్లు పెడతారు. ఒక్కసారిగా అవాక్కైన చుట్టాలు ఏంటిది అని ప్రశ్నిస్తారు. దీంతో పెళ్లి కొడుకు తండ్రి పాత్రలో ఉన్న వ్యక్తి మన ప్రాంతంలో నీటి సమస్య మాత్రమే ఉంది. బీర్లకు కొరత లేదు. ప్రస్తుతం లీటర్ నీటి కంటే, బీరు రేటు తక్కువ అంటు సెటైరికల్‌గా మాట్లాడటం ఆ వీడియోలో కనిపించింది.

Advertisement

Next Story

Most Viewed