- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీబీసీ పంజాబీ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్
దిశ, డైనమిక్ బ్యూరో: బీబీసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని బీబీసీ పంజాబీ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసింది. 'వారిస్ పంజాబ్ దే' నాయకుడు అమృత్ పాల్ సింగ్ ఇష్యూ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా భారతదేశంలో ఖాతా నిలిపివేయబడింది అంటూ బీబీసీ న్యూస్ పంజాబీ ట్విట్టర్ ఖాతాలో ఒక సందేశం ప్రత్యక్షమైంది.
పంజాబీ బీబీసీ అకౌంట్‌తో పాటు దేశంలోని పలువురు జర్నలిస్టుల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా నిలిపివేయబడ్డాయి. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఖలిస్థాన్ అనుకూల అభిప్రాయాలను ప్రచారం చేస్తున్న కనీసం ఆరు యూట్యూబ్ ఛానెల్స్ పై బ్యాన్ విధించారు. విదేశాల నుంచి నడిచే ఈ ఛానెళ్లు పంజాబ్ రాష్ట్రంలో సంక్షోభం సృష్టించేలా కంటెంట్ ప్రదర్శిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీటిపై కూడా కేంద్రం ఆంక్షలు విధించింది.