బీజేపీ ఫ్రీ హ్యండ్ ఇచ్చింది : CM Basavaraj Bommai

by samatah |   ( Updated:2022-08-27 13:00:46.0  )
బీజేపీ ఫ్రీ హ్యండ్ ఇచ్చింది : CM Basavaraj Bommai
X

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పిడిపై సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ విషయంలో బీజేపీ తనకు ఫ్రీ హ్యండ్ ఇచ్చిందని పునరుద్ఘాటించారు. పార్టీ సీఎంను మార్చే ఉద్దేశం లేదని చెప్పారు. శనివారం ఆయన ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు కీలుబొమ్మలా వ్యవహరించట్లేదని, తనను ఆదర్శంగా తీసుకున్నానని తెలిపారు. ఆయన గొప్ప ప్రజానేత అని, పరిపాలనలో సాయం తీసుకుంటున్నానని బొమ్మై పేర్కొన్నారు. తమ రోజువారి కార్యకలాపాల్లో యడియూరప్ప ఎలాంటి జోక్యం చేసుకోరని అన్నారు. అయితే ఇలాంటి వాదనలు తెరపైకి తీసుకొచ్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్రమంగా మత మార్పిడి జరుగుతున్నాయని, దానిని దృష్టిలో పెట్టుకుని మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు రాజకీయ ప్రయోజనం కోసమని అన్నారు. కాంగ్రెస్ దీని వెనక ఉందని ఆరోపించారు. కాగా, గత నెల 28తో బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్నారు.

Also Read : చైనా పేరు చెప్పాలంటేనే ప్రధానికి భయం.. మోడీపై ఒవైసీ ఫైర్

Advertisement

Next Story