Meghalaya: బంగ్లాదేశ్ నాయకుడి మృతదేహం లభ్యం

by Shamantha N |
Meghalaya: బంగ్లాదేశ్ నాయకుడి మృతదేహం లభ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: మేఘాలయాలోని ఈస్ట్ జైన్తియా హిల్స్ జిల్లాలో బంగ్లాదేశ్ నాయకుడి శవం లభ్యమైంది. డోనా భోయ్ వద్ద భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి 1.5 కి.మీ దూరంలో తమలపాకు తోటలో అవామీ లీగ్ నాయకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని సోమవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నట్లు జైన్తియా ఎస్పీ గిరిప్రసాద్ తెలిపారు. మృతుడి దగ్గర బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ దొరికినట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లోని పిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన అవామీ లీగ్ నాయకుడు ఇషాక్ అలీ ఖాన్ పన్నాగా ఆయన్ని గుర్తించామన్నారు. ఖలీహ్రియత్ లోని సివిల్ హాస్పిటల్ లో పన్నా మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు వెల్లడించారు. తదుపరి ప్రక్రియల కోసం డెడ్ బాడీని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత పన్నా పరారీలో ఉన్నాడు. భారత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుంది అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed