Bangladesh Riots: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. భారత సర్కార్ కీలక నిర్ణయం

by Shiva |
Bangladesh Riots: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. భారత సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లినా.. బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయంలో ఢాకా, ఛటోగ్రామ్ ప్రాంతాల్లో ఆందోళనకారులు హిందువుల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులకు కేంద్రం కీలక సూచన చేసింది. బయట భీతావహ వాతావరణం ఉందని.. అత్యవసరం అయితే తప్పా.. ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లో భారత్ వీసా దరఖాస్తు కేంద్రాలను తక్షణమే మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీసా కేంద్రాలు తెరవకూడదని అక్కడి ఎంబసీకి మార్గదర్శకాలను విడుదల చేశారు. చిట్టగాంగ్, రాజ్‌షాషీ, ఖుల్నా, సిల్‌హెట్, నగరాల్లోని భారత కన్సులేట్లు, రాజధాని ఢాకాలోని దౌత్య కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయని కేంద్రం ప్రకటించింది.

Advertisement

Next Story