Bangladesh: బంగ్లాదేశ్ కరెన్సీలో మార్పులు.. నోట్లపై హసీనా తండ్రి చిత్రం తొలగింపు !

by vinod kumar |
Bangladesh: బంగ్లాదేశ్ కరెన్సీలో మార్పులు.. నోట్లపై హసీనా తండ్రి చిత్రం తొలగింపు !
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో యూనస్ (Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ కరెన్సీలో కీలక మార్పులు తీసుకొచ్చింది. కరెన్సీపై ప్రస్తుతం ఆ దేశ జాతిపిత, మాజీ ప్రధాని షేక్ హసీనా (Shake haseena) తండ్రి ముజిబుర్ రెహమాన్ (Muzibur Rehaman) చిత్రం ఉండగా దానిని తొలగించి కొత్త నోట్లను ముద్రించేందుకు అనుమతిచ్చింది. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఈ విషయాన్ని వెల్లడించింది. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన తిరుగుబాటు లక్షణాలతో కూడిన చిత్రాలతో కొత్త నోట్లను ముద్రిస్తున్నట్టు తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వం సూచనల మేరకు, 20, 100, 500, 1000 టాకా నోట్లను ముద్రిస్తున్నట్టు పేర్కొంది. మతపరమైన నిర్మాణాలు, బెంగాలీ సంప్రదాయాలు, నిరసనల సమయంలో గీసిన గ్రాఫిటీ కొత్త నోట్లలో చేర్చుతున్నట్టు తెలిపింది. పాత నోట్లపై ఉన్న ముజిబుర్ రెహమాన్ చిత్రాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్టు తెలిపింది. రీ డిజైన్ చేసిన నోట్లు ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story