Kaveri water dispute : ‘కావేరి’ వివాదం.. 44 విమానాలు రద్దు

by GSrikanth |   ( Updated:2023-09-29 06:15:32.0  )
Kaveri water dispute : ‘కావేరి’ వివాదం.. 44 విమానాలు రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడుకు కావేరి నీటీ విడుదలను వ్యతిరేకిస్తూ శుక్రవారం కర్నాటకలో బంద్ కొనసాగుతున్నది. రైతు సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో హోటళ్లు, విద్యా, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. ట్యాక్సీలు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ బంద్ ప్రభావం విమాన రాకపోకలపై పడింది. దీంతో బెంగళూరు విమానాస్రయంలో ఈ ఉదయం 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు చోట్ల ఆందోళనకారులు నిరసలకు దిగడతం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

బంద్ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తమైనంది. శఉక్రవారం అర్థరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. కీలకమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరో వైపు కావేరి జలాల విషయంలో తమిళనాడులోనూ రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది.

Advertisement

Next Story

Most Viewed