Actor Darshan: కన్నడ నటుడు దర్శన్ కు ఊరట

by Shamantha N |   ( Updated:2024-12-13 15:26:41.0  )
Actor Darshan: కన్నడ నటుడు దర్శన్ కు ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు(Actor Darshan) భారీ ఊరట దక్కింది. తన అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్‌ (Actor Darshan)కు రెగ్యులర్ బెయిల్ దొరికింది. ఈ హత్య కేసులో కర్ణాటక హైకోర్టు దర్శన్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దర్శన్‌తో పాటు అతడి స్నేహితురాలు పవిత్ర గౌడకు కూడా హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే, ఈ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మరో ఏడుగురికి బెయిల్‌ ఇచ్చింది.

రేణుకాస్వామి హత్య కేసు

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో (Renukaswamy murder case) జూన్‌ 11న దర్శన్‌ అరెస్టు సంచలనంగా మారింది. తన స్నేహితురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్‌ పంపాడని అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో దర్శన్‌, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. రేణుకాస్వామిని దారుణంగా కొట్టినట్లు కేసు విచారణలో తేలింది. రేణుకాస్వామికి కరెంటు షాక్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక, ఈ కేసులో ఇప్పటికే తాత్కాలిక బెయిల్‌పై ఉన్న దర్శన్‌ తనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయాలంటూ మరో పిటిషన్‌ వేశారు. దీంతో, ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, దర్శన్‌ ప్రస్తుతం వెన్నునొప్పితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

Read More..

Darshan : కన్నడ స్టార్ నటుడికి బిగ్ రిలీఫ్

Advertisement

Next Story

Most Viewed