- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంటల్లో కాలుతున్న పెనంపై కూర్చొని భక్తులను దీవిస్తున్న బాబా (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మూడ నమ్మకాల విషయంలో జనాల్లో మార్పు రావడం లేదు. ఈ క్రమంలో దొంగ బాబాలు మాయమాటలు చెప్పి వారి విన్యాసాలను చూపించి ప్రజలను నమ్మిస్తున్నారు. అలాంటి బాబాలను నమ్మి ఎంతో మంది పోయారు. తాజాగా, ఓ బాబా మండుతున్న పొయ్యిపై ఉన్న పెనంపై కూర్చొని భక్తులను దీవిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
వివరాలు.. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా తివాసా ప్రాంతంలో సంత్ గురుదాస్ అనే బాబా ఉన్నాడు. అయితే ఆ బాబా చెంతకు ఎంతో మంది భక్తులు వస్తుంటారు. అయితే గురుదాస్ బాబా మండుతున్న పొయ్యిపై ఉన్న పెనంపై కూర్చొని భక్తులకు దీవెనలు ఇచ్చాడు. అంతేకాకుండా బాబా పక్కనున్న వారు మంట కింద కట్టెలు కూడా పెట్టడం కూడా వీడియోలో చూడవచ్చు. బాబా మాత్రం చలనం లేకుండా భక్తులతో మాట్లాడటం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దీంతో అది చూసిన వారు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
चुलीवरील मटण, मिसळ, आईस्क्रीम नंतर आता मार्केट मध्ये चुलीवरील बाबा आलाय 🤣 pic.twitter.com/NPF3rR3eCU
— Pratik S Patil (@Liberal_India1) March 21, 2023