హోలీ పండుగ వేళ భారత్ కు ఆస్ట్రేలియా ప్రధాని

by Javid Pasha |
హోలీ పండుగ వేళ భారత్ కు ఆస్ట్రేలియా ప్రధాని
X

దిశ, వెబ్ డెస్క్: హోలీ పండు రోజు (మార్చి 8)న భారత్ కు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ రానున్నారు. ఈ విషయాన్ని భారత్ లోని ఆస్ట్రేలియా హై కమిషనర్ బారీ ఓ'ఫారెల్ తెలిపారు. హోలీ పండుగ రోజు సాయంత్రం పూట ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కు చేరుకుంటారని వెల్లడించారు. అక్కడ జరిగే హోలీ వేడుకల్లో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే అహ్మదాబాద్‌లో భారత్ , ఆస్ట్రేలియాల మధ్య జరిగే నాలుగో టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ముంబైలో జరిగే ఇండియా ఆస్ట్రేలియా సీఈవో ఫోరమ్‌లో అల్బనీస్ పాల్గొంటారు.

ఆయనతో పాటు ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ టూరిజం మంత్రి డాన్ ఫారెల్, రిసోర్సెస్ మినిస్టర్ మడేలిన్ కింగ్‌లు కూడా హాజరవుతారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా మైత్రి ఉందని, ఇరు దేశాల సంస్కృతి సంప్రదాయాలను ఒకరినొకరు గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. భారత్, ఆస్ట్రేలియా దౌత్య బంధం బలమైందని బారీ ఓ'ఫారెల్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story